పార్లమెంట్‌లో ముస్లింపై దాడి జరగవొచ్చు !

Telugu Lo Computer
0


పార్లమెంట్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి జరిగే రోజు దగ్గర్లోనే ఉందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీఎస్పీ ఎంపీ దనిష్ అలీపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓవైసీ ఇలా స్పందించారు. దేశవ్యాప్తంగా గోవుల స్మగ్లింగ్‌తో పాటు ఇతర ఘటనల్లో సామూహిక దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా ఓ బీజేపీ ఎంపీ ముస్లిం ఎంపీని దూషించిన తీరు ప్రజలంతా చూశారని ఆయన గుర్తు చేశారు. తన మాటల్ని గుర్తుంచుకోవాలని, పార్లమెంట్‌లో ముస్లింపై సామూహిక దాడి జరుగుతుందని, ఆ రోజు దగ్గర్లోనే ఉందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాశ్ అని ప్రధాని మోదీ స్లోగన్స్ ఇస్తున్నారని, కానీ ఆ స్లోగన్ ఆచరణలో లేదన్నారు. ముస్లిం ఎంపీని బెదిరిస్తూ బీజేపీ ఎంపీ మాట్లాడిన మాటల్ని ఆరబిక్ భాషలో తర్జుమా చేసి యూఏఈకి ప్రధాని మోదీ పంపిస్తారా అని ఓవైసీ ప్రశ్నించారు. హర్యానాలో జునైద్‌, నసీర్ హత్యల గురించి ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, ఎంఐఎం అభ్యర్థులు లేని చోట సీఎం కేసీఆర్‌కు సపోర్టు ఇవ్వాలని ఓవైసీ తన పార్టీ కార్యకర్తల్ని, ప్రజలను కోరారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ఆయన సవాల్ విసిరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)