సెప్టెంబర్‌లో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 August 2023

సెప్టెంబర్‌లో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు !


సెప్టెంబర్‌లో ఐదు రోజులు పాటు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలను నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం తెలిపారు. అయితే, ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? అనే కోణం కూడా వినిపిస్తోంది. ఈ మేరకు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ సమావేశాల సందర్బంగా మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీ​ర్మానం వీగిపో​యింది. ఈ క్రమంలో మణిపూర్‌ ఘటనపై మోడీ స్పందించాలని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. దీంతో, మణిపూర్‌పై స్పందించిన ప్రధాని మోడీ అక్కడ శాంతి నెలకొల్పే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అంటూ కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల నేతలకు గట్టి సమాధానం ఇచ్చారు. 

No comments:

Post a Comment