కొండచరియలు విరిగిపడటంతో కిలోమీటర్ల మేర చిక్కుకున్న యాత్రికులు

Telugu Lo Computer
0


త్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు దారిపొడవునా ఆవస్థలు పడుతున్నారు. కొడియాల్ వద్ద 40 కి.మీ. మేర సుమారు 1500 వాహనాలు నిలిచిపోయాయి. అందులో కనీసం 20 వేల మంది జనం ఎటూ కదలలేక అక్కడే నిలిచిపోయారు. రిషికేష్ యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, బెంగుళూరుకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా అక్కడ చిక్కుకున్నట్లు తెలిపారు. ఈరోజు కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావారణ శాఖ వెల్లడిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)