దిగివస్తున్న టమాటా ధర !

Telugu Lo Computer
0


మాటాలు ఎక్కువగా పండించే కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాల ఏపీఎంసీ మార్కెట్లకు మూడు రోజులుగా టమాటా భారీగా తరలిస్తుండడంతో టమోటా ధరలు ఎట్టకేలకు దిగి వస్తున్నాయి. 15 కిలోల టమాటా బాక్స్‌ ధర వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఫలితంగా రిటైల్‌ మార్కెట్‌లో మూడు రోజుల క్రితం వరకు కిలో రూ.120పై చిలుకు పలికిన టమాటా ధర ప్రస్తుతం రూ.80-90 మధ్య ఉంది. అయితే నాణ్యమైన టమాటా ధర ఇంకా రూ.100కుపైగానే ఉండడం గమనార్హం. మరో వారం రోజుల్లో మార్కెట్‌కు మరింత టమాటా పంట తరలిరావచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టమాటా ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)