ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదుల హతం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 7 August 2023

ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదుల హతం


మ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించిన ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. వారు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఒకరిని సెల్ఫ్‌ స్టైల్‌ డివిజినల్‌ కమాండర్‌ మునీర్‌ హుస్సేన్‌గా గుర్తించామన్నారు. మరో వ్యక్తి అతడికి బాడీగార్డుగా వచ్చినట్లు నిర్ధారించారు. ఈ ఇద్దరూ డేగ్వార్‌ సెక్టార్‌లోని సరిహద్దు రేఖ వద్ద సైన్యానికి ఎదురుపడినట్లు చెప్పారు. చీకట్లో ఉగ్రవాదుల కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై ఎన్‌కౌంటర్‌ చేశాయన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకు చెందిన పీఆర్‌వో లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్ట్‌వాల్‌ మాట్లాడుతూ గర్హీ బెటాలియన్‌ ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటలకు ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందం ఇద్దరు చొరబాటుదారులను గుర్తించిందని చెప్పారు. కాల్పులు జరిపిన వెంటనే ఓ ముష్కరుడు కుప్పకూలాడని, మరొకడు వెనక్కి పరిగెత్తే ప్రయత్నం చేశాడన్నారు. అతడిని వెంబడించి భద్రతా బలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. పోలీసుల రికార్డు ప్రకారం మృతుల్లో ఒకరిని హుస్సేన్‌గా గుర్తించామన్నారు. అతడు పూంఛ్‌లోని బాగిలడ్రా గ్రామానికి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. హతమైన మునీర్‌ హుస్సేన్ 1993లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ వెళ్లాడు. అక్కడే ఆయుధ శిక్షణ పొంది మూడేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. 1998 వరకు అనేక సార్లు భద్రతా బలగాలపై కాల్పులు జరిపే ఆపరేషన్ల వెనుక మాస్టర్‌ మైండ్‌గా వ్యవహరించాడు. హుస్సేన్‌కు ఇద్దరు భార్యలు, కొంత మంది పిల్లలున్నారు. పీవోకేకు చెందిన హిజ్బుల్ అగ్రనేత సయీద్‌ సలావుద్దీన్‌కు సన్నిహితుడైన మౌలానా దావూద్‌ కశ్మీరికి.. హుస్సేన్‌ అత్యంత సన్నిహితుడు. మాజీ ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలకు పంపి.. తమ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు హుస్సేన్‌ను ఇటు వైపు పంపించి ఉంటారని రక్షణశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

No comments:

Post a Comment