గార పట్టిన పళ్లకు వంటింటి చిట్కా !

Telugu Lo Computer
0


చాలా మంది దంతాలకు గార పట్టి పసుపు రంగులోకి మారిపోతాయి. దీంతో నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బంది పడుతూంటారు. వాటిని క్లీన్ చేయించుకునేందుకు క్లినిక్ కు వెళ్లాలంటే భయపడతారు. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలా అని మదన పడుతూంటారు. పసుపుపచ్చగా ఉండటం వల్ల నలుగురిలో నవ్వుతూ ఉండలేరు. సరిగ్గా మాట్లాడలేరు. నోరు దుర్వాసన కూడా వస్తుంటుంది. దీనిని వదిలించుకునేందుకు అర చెక్క నిమ్మరసం, ఒక ఇంచు అల్లం తురుము, కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ నిమ్మ తొక్క తురుము ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అల్లంపై పొట్టు తీసేసి తురిమి పెట్టుకోవాలి. అందులో అర చెక్క నిమ్మరసం పిండి, దాని తొక్కను కూడా తురిమి వేసుకోవాలి. అందులో ఉప్పువేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ తో అద్ది దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై పేరుకున్న గార, పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారుతాయి. చిగుళ్లు కూడా బలంగా, పటిష్టంగా ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)