పారిజాతం ఆకులు - కీళ్ల నొప్పులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 August 2023

పారిజాతం ఆకులు - కీళ్ల నొప్పులు !


ర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) కు వయసుతో సంబంధం లేదు. ఆహార లోపం కారణంగా కూడా యుక్తవయసు వారికీ ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. ఇందులో రకాలున్నా లక్షణాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. కీళ్లనొప్పులు, ఎముకల నొప్పులు, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, కొందరికైతే అడుగుతీసి అడుగువేయడం కూడా నరకంగా ఉంటుంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి మన ఇంట్లోనే ఉన్న పారిజాత ఆకులతో అద్భుతమైన వైద్యం చేయొచ్చు. పారిజాత వృక్షాన్ని దైవ వృక్షంగా భావిస్తారు. కీళ్లనొప్పులను తగ్గించడంలో పారిజాత ఆకులు ఎంతో ఉపయోగపడుతాయి. పారిజాత ఆకులు 6-7 తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక గ్లాస్ నీటిలో కలిపి ఒక గిన్నెలో పోసి అరగ్లాసు అయ్యే వరకూ మరగనివ్వాలి. అలా వచ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తాగేయాలి. ఇలా నెల రోజులపాటు చేస్తే కీళ్లలో నొప్పులు తగ్గుతాయి. పారిజాత ఆకులలో ఉండే జిగురు కషాయం ద్వారా శరీరంలోకి వెళ్లి.. మోకాలిలో అరిగిపోయిన కీళ్లపై పనిచేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులతో కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే కొబ్బరి నూనెలో 5-6 చుక్కల పారిజాత నూనె వేసి.. కీళ్ల నొప్పులు ఉన్న చోట కాసేపు మర్దనా చేయాలి.ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నొప్పులు తగ్గుముఖం పడతాయి.

No comments:

Post a Comment