కుప్పింటాకు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


యుర్వేదంలో ఎక్కువగా కుప్పింటాకు మొక్కను వాడుతూ ఉంటారు. గజ్జి, తామర, దురదలు, దద్దుర్లు వంటి ఏటువంటి చర్మ సమస్యకు అయినా ఈ కుప్పింటాకు చాలా బాగా పనిచేస్తుంది. కుప్పింటాకులను తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రంగా కడిగితే సరిపోతుంది. నాలుగు నుంచి ఐదు రోజులు ఈ విధంగా చేస్తే చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుంది. కుప్పింటాకు ఆకులను, వెల్లుల్లి రెబ్బలను, మిరియాలను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమంను నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెను వడగట్టి నిలువ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటె నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క ఆకులను మెత్తగా చేసి అందులో కొద్దిగా పసుపును కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)