రెప్ప పాటులో రైల్ టికెట్ బుకింగ్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 August 2023

రెప్ప పాటులో రైల్ టికెట్ బుకింగ్ !


మిళనాడులో ఓ వండర్ జరిగింది. రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర చాలా క్యూ ఉంది. దీంతో ఓ ప్రయాాణికుడు ఏటివిఎం దగ్గరకు వెళ్లగా అక్కడున్న ఆపరేటర్ టికెట్ ఇచ్చిన తీరును చూసి షాక్ అయ్యాడు. కేవలం మూడు సెకన్ల వ్యవధిలో టికెట్ ఇచ్చి ఔరా అనిపించుకున్నాడు.రైలు టికెట్ అనగానే అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. మనదేశంలో రైలు టికెట్ దొరకడం రానురాను అంత కష్టమైన పనిగా మారుతోంది. ఎప్పుడు చూసినా రైళ్లు ఫుల్, టికెట్లు నిల్ అన్నట్టు సాగుతోంది ఈ తంతు అంతా. ఇక పండుగలు, పెళ్లిళ్ల సీజన్, సెలవుల సమయంలో  అయితే 3 నెలల ముందే టికెట్లు అయిపోతాయి. ఇక తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే రైల్వే స్టేషన్లో క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలంటే నరకయాతన పడాలి. చాంతాడంత క్యూలో నిలబడి టికెట్ తీసుకొనే సమయానికి ట్రైన్ కూడా కదిలే అవకాశం ఉంది. టికెట్ల క్యూ రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ యం ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషిన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయితే ఆ మిషన్ ను ఒకరు ఆపరేట్ చేస్తుంటారు. అయితే తమిళనాడులో ఆమిషన్ దగ్గర ఉన్న వ్యక్తి మూడు సెకన్లలోనే టికెట్ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది. 

No comments:

Post a Comment