సిటి బస్సుల్లో డే బస్ పాస్ ధరలు పెంపు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 1 August 2023

సిటి బస్సుల్లో డే బస్ పాస్ ధరలు పెంపు !


హైదరాబాద్ సిటీ పరిధిలో తిరిగే సిటి బస్సుల్లో డే బస్ పాస్ ధరను రూ.20 పెంచుతూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.  100 రూపాయలు ఉన్న డే పాస్ ఇప్పుడు రూ.120 లకు పెరిగింది. ప్రస్తుతం డే బస్ పాస్ మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ. 100 లకు లభించనుంది. అంతుకుముందు వీరికి రూ.80 లకే డే బస్ పాస్ లభించేది. గతంలో డే బస్ పాస్ రూ.120 లుగానే ఉండేది. అయితే ప్రయాణికులను ఆకర్షించేందుకు డే బస్ పాస్ ధరను రూ.100 తగ్గించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రాయితీ కూడా ఇస్తున్నారు. తాజాగా ఆర్టీసీ గతంలో ఉన్న ధరనే ఖరారు చేసింది. డే బస్ పాస్ ధరలు పెరగడంతో వాటికి ఆదారణ తగ్గే అవకాశం ఉంది. డే బస్ పాస్ రూ.120 ఉన్నప్పుడు రోజుకు 25 పాసులు అమ్ముడుపోతే.. రూ.100 లకు తగ్గించినప్పుడు రోజుకు 40 వేల డే బస్ పాసులు విక్రయించారు. దీన్ని బట్టి మళ్లీ డే బస్ పాసులకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఆర్టీసీ డే బస్ పాసులనే కాదు గతంలో నార్మల్ టికెట్ ధరలు కూడా భారీగా పెంచింది. ఆర్టీసీ తెలియకుండా బస్ టికెట్ ధరలు పెంచింది. ఒకప్పుడు కరీంనగర్ నుంచి జేబీఎస్ కు ఎక్స్ ప్రెస్ బస్ టికెట్ రూ.180 ఉంటే.. ఇప్పుడు అది రూ.240 లకు పెంచారు. టికెట్ ధరల పెంచడమే కాకుండా ప్రజలను ఆకర్షించేందుకు ఆర్టీసీ అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఆర్టీసీ ఈ మధ్య టీ9-30, టీ9-60 టికెట్లను ప్రవేశపెట్టింది. రూ.50 చెల్లించి టీ9-30 టికెట్ తీసుకుంటే 30 కిలోమీటర్ల పరిధిలో అప్ అండ్ డౌన్ ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ టికెట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే పని చేస్తుంది. ఇక టీ9-60 ను రూ.100 చెల్లించి కొనుగోలు చేస్తే.. 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణం చేయవచ్చు. ఈ టికెట్ కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేస్తుంది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment