స్థిరంగా ఉన్న బంగారం ధరలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 28 August 2023

స్థిరంగా ఉన్న బంగారం ధరలు !


రుసగా పెరిగిన బంగారం ధరలు గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు.  ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,600గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,780 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 76,900లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,900గా ఉండగా.. చెన్నైలో రూ. 80,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది.

No comments:

Post a Comment