క్షమాపణ చెప్పిన లారెన్స్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 28 August 2023

క్షమాపణ చెప్పిన లారెన్స్ !


కాంచన, కాంచన 2 వంటి చిత్రాలతో ఫుల్ ఫేమస్ అయిన రాఘవ. ప్రస్తుతం చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా రాబోతుంది ఈ . ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఈ ఆడియో లాంచ్ చెన్నైలో నిర్వహించింది చిత్రయూనిట్. అయితే అక్కడ ఓ స్టూడెంట్‏కు, బౌన్సర్స్ కు మధ్య గొడవ జరగ్గా.. తాజాగా లారెన్స్ క్షమాపణ తెలిపారు. చంద్రముఖి 2 ఆడియో లాంచ్ వేడుకలో ఓ స్టూడెంట్, బౌన్సర్ కు మధ్య గొడవ జరిగిందని ఇప్పుడే నాకు తెలిసింది. వేడుక జరుగుతున్న సమయంలో బయట వారి మధ్య గొడవ జరగడంతో నాకు తెలియలేదు. ఇప్పుడే ఈ విషయం తెలిసింది. విద్యార్థులు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. విద్యార్థుల పట్ల నేను ఎలా వ్యవహరిస్తానో మీ అందరికీ తెలుసు. ఇలాంటి గొడవలు నాకు నచ్చవు. కారణం ఏదైనా సరే అలా స్టూడెంట్ ను కొట్టడం చాలా తప్పు. ఇది జరగకుండా ఉండాల్సింది. అందుకు క్షమాపణ చెబుతున్నాను. బౌన్సర్స్ ఇకపై ఇలాంటి దాడి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు.


No comments:

Post a Comment