మధుమేహం - కొత్తిమీర

Telugu Lo Computer
0


కొత్తిమీర మన వంటలలో అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్థాలలో ఒకటి. కొత్తిమీర భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలోని అన్ని భాగాలు తినదగినవే. అయితే తాజా ఆకులు , ఎండిన గింజలు, మసాలాగా ఉపయోగిస్తారు. ఇది తాజా ఆకుపచ్చ రూపంలో లేదా ఎండిన గింజల రూపంలో వంటకాలలో మసాలా గా వాడుకోవచ్చు. కూరలు, గ్రేవీలలో ఎక్కువ భాగం కొత్తిమీర లేకపోతే అసంపూర్ణంగా ఉంటాయి. మంచి రుచి ,సువాసన కోసం కొత్తిమీరపై ఆధారపడతారు. కొత్తిమీర గింజలు ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి మేలు చేస్తాయి. మధుమేహం చికిత్సలో, నియంత్రించడంలో కొత్తిమీర సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది ఇన్సులిన్ చర్యను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో మరింత సహాయపడుతుంది. అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రెప్టోజోటోసిన్-ప్రేరిత డయాబెటిక్ ఎలుకలలో ప్యాంక్రియాటిక్ బీటా కణాల నుండి ఇన్సులిన్ విడుదలను నియంత్రించడంలో కొత్తిమీర గింజలు ప్రభావవంతంగా తోడ్పడినట్లు నిర్దారణ అయింది. కొత్తిమీర విత్తనాలలో ఉండే ఇథనాల్ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాల నుండి ఇన్సులిన్ విడుదలను పెంచడంలో ఇవి సహాయపడతాయి. కొత్తిమీర గింజలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను మరింత స్థిరంగా ఉంచుతాయి. కొత్తిమీర లో ఉండే పొటాషియం, కాల్షియం, విటమిన్-కె వంటి పోషకాలు అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చూస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి వేడిని తొలగిస్తుంది. కిడ్నీలోని వ్యర్ధపదార్ధాలను బయటకు పంపటంలో ఉపకరిస్తుంది. విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ, కెరోటినాయిడ్లు దీనిలో ఉన్నాయి. కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంతోపాటు గుండె ఆరోగ్యానికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)