భక్తుల కోసం ఏం చేస్తున్నారు ?

Telugu Lo Computer
0


తిరుమలకు కాలిబాటలో వచ్చే భక్తులకు అటవీ శాఖ, టీటీడీ అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు కల్పించారనే అంశంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది.ఇటీవల చిరుత దాడిలో మరణించిన బాలిక లక్షిత కుటుంబానికి మరో రూ 15లక్షలు ఆర్థిక సాయం ఇచ్చే విషయమై పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భక్తుల భద్రతకు అలిపిరి నుంచి తిరుమల నడక దారిలో ఇనుప కంచె ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీకి నోటీసులు జారీ చేసింది. భక్తులకు రక్షణ కల్పించాల్సిన టీటీడీ కర్రలు ఇవ్వడం ఏంటని న్యాయవాది యాలమంజుల బాలాజీ వాదించారు. వన్య ప్రాణుల కదలికలకు అవసరమైతే అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. భక్తుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. ఇటీవల చిరుత దాడిలో మరణించిన బాలిక లక్షిత (6) కుటుంబానికి ఇప్పటికే రూ 15లక్షలు ఇచ్చినట్లు తితిదే, ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించాయి. మరో రూ15లక్షలు ఆర్థిక సాయం ఇచ్చే విషయమై పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తిరుమలలో తాజాగా చిరుతల సంచారంతో భక్తుల రక్షణ కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. నడక మార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను సిబ్బంది బంధించారు. అదే సమయంలో గుంపులుగా భక్తులు కాలినడక మార్గంలో వెళ్లేలా చర్యలు అధికారులు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసారు. మధ్నాహ్నం తరువాత చిన్నారులు ఉన్న పెద్దలను సైతం నడక మార్గంలో అనుమతించటం లేదు. ఇక, విచారణ సమయంలో మెట్ల మార్గంలో భక్తుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపైన న్యాయస్థానం ప్రశ్నించింది. చిరుతనుల బంధించేందుకు ప్రత్యేకంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. నడక మార్గంలో భక్తులకు కల్పించే దివ్య దర్శనం విధానంలో మార్పులు తెచ్చింది. దివ్య దర్శనంకు వెళ్లే వారికి మోకాలి పర్వతం వద్ద తనిఖీలను మినహాయిం.. రోడ్డు మార్గంలో వచ్చినా దర్శన సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో, కొద్ది రోజులుగా కాలి నడక మార్గంలో వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు హైకోర్టు టీటీడీ తీసుకుంటున్న చర్యలపైన పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)