థర్మాకోల్ తెప్పపై స్కూల్ కెళుతున్న విద్యార్థులు

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని పెద్ద ఆనకట్టల్లో ఒకటైన జాయక్‌వాడీ డ్యామ్‌కు సమీపంలో ఉంటుంది బివాధనోరా గ్రామం. డ్యాం బ్యాక్ వాటర్ రెండు నదులు గ్రామాన్ని చుట్టుముట్టి ఉంటాయి. వంతెన నిర్మాణం డిమాండు ఎప్పటినుంచో పెండింగులో ఉంది. కానీ అది నెరవేరటంలేదు. గ్రామంలోని పిల్లలు బడికి వెళ్లాలంటే మందపాటి థర్మాకోల్‌ తెప్పలే ఆధారం. విద్యార్థులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఆ తెప్పలాంటిదానిపైనే ప్రతీరోజు బ్యాక్‌వాటర్‌ను దాటి స్కూల్ కు వెళ్లి వస్తున్నారు. ఒక్కోసారి పాములు థర్మాకోల్‌ తెప్పపైకి పాకుతూ వచ్చేస్తాయి. దీంతో పిల్లు ఓ కర్ర పట్టుకుని వాటిని ఎదుర్కొంటూ  రోజూ కిలోమీటరు దూరం డ్యాం నీటిని దాటి వెళుతున్నారు. దాదాపు 50 ఏళ్లుగా అదే సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆ గ్రామస్తులు. దీనిపై అధికారులు వాదన మాత్రం వేరుగా ఉంది. డ్యాం నిర్మించే సమయంలో పునరావాసం కల్పిస్తామన్నా కొందరు అక్కడే ఉండిపోయారని దీంతో వారు ఆ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)