ఇంటి పద్ధతుల ద్వారా ఎలుకలను తరిమికొట్టొచ్చు !

Telugu Lo Computer
0


లుకలను వదిలించుకునేందుకు చాలా మంది ఇళ్లలో ఎలుకల మందు వాడుతారు. కొందరు ఉత్తి పుణ్యానికి వాటిని చంపడం ఎందుకని వదిలేస్తుంటారు. ఉల్లిపాయలు, టమాటాలు, ఎండురొయ్యలు వంటి ఆహార పదార్థాలంటే.. వాటికి మహా ప్రాణం. అందుకే ఎలుకలను చంపేందుకు వాటిలోనే మందులు కలిపి పెడుతుంటారు. రాత్రి వేళలో ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్నప్పుడు ఎలుకలు ఉంటే.. ప్రశాంతత మాట దేవుడెరుగు.. అవిచేసే మోతకు కనీసం నిద్రకూడా పట్టదు. ఒక్కోసారి ఇల్లంతా తిరిగి మనుషుల కాళ్లను కూడా కొరికేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఆసుపత్రుల్లోనూ ఎలుకల బెడద ఉందని కూడా వచ్చాయి. ఎలుకలను చంపకుండా కొన్ని ఇంటి పద్ధతుల ద్వారా వాటిని తరిమికొట్టొచ్చు. 

పిప్పరమెంట్ ఆయిల్: ఎలుకలకు పిప్పరమెంట్ వాసన నచ్చదు. అది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ వాసనకు అవి ఇంటి నుంచి వెళ్లిపోతాయ్ పిప్పరమెంట్ ఆయిల్ ను ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే.. అవి ఇంటి నుంచి మాయమవుతాయి. పిప్పరమెంట్ ఆయిల్ ను నీటిలో కలిపి కూడా వాడుకోవచ్చు.

పటిక పొడి: ఎలుకలు పటిక వాసనను కూడా ఇష్టపడవు. పటికను పొడిచేసి ఎలుకలు నివసించే ప్రదేశాల్లో చల్లాలి. లేదా పటిక పొడిని నీటిలో కలిపి ఆ నీటిని.. ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. ఇలా చేస్తే ఎలుకలు ఇంటి నుంచి వెళ్లిపోతాయి.

కారం పొడి: కారం పొడితో కూడా ఎలుకలను ఇంట్లో నుంచి తరిమికొట్టొచ్చు. ఎర్ర కారంపొడి లేదా.. కారం పొడిని కలిపిన నీరును చల్లుకోవచ్చు. కారంపొడిని వాడే ముందు చేతులకు గ్లోవ్స్, కళ్లకు అద్దాలు ధరించండి.

కర్పూరం: మనం పూజకు ఉపయోగించే కర్పూరం కూడా ఎలుకలను దూరం చేస్తుంది. స్టోర్ రూమ్, కిచెన్ ఆ ప్రదేశాలలో కర్పూరం ముక్కలను ఉంచండి. ఆ వాసనకు ఎలుకలు పారిపోతాయి.

పొగాకు: పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటనలు చూస్తూనే ఉంటాం. పొగాకు కూడా ఎలుకలను నిర్మూలించడంలో సహాయపడుతుంది. శనగపిండి లేదా మైదాపిండి కొద్దిగా నెయ్యి కలిపి దానితో మాత్రలు తయారు చేసుకోవాలి. వాటిని ఎలుకలు ఉండే ప్రదేశాల్లో ఉంచితే.. ఇంటిలో ఉన్న ఎలుకలన్నీ బయటకు వస్తాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)