చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్ !

Telugu Lo Computer
0


త్తమ జాతీయ నటుడు అవార్డు గ్రహీత అల్లు అర్జున్ తన మేనత్త నివాసానికి వెళ్లి చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి మెగాస్టార్ చిరంజీవి దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజానికి చిరంజీవి కొన్నాళ్ల క్రితమే మోకాళ్ళకి సంబంధించిన సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొన్నాళ్లపాటు ఉన్న ఆయన ఈ మధ్యనే హైదరాబాద్ తిరిగి వచ్చారు. పూర్తి స్థాయిలో రెస్ట్ మోడ్ లో ఉన్న చిరంజీవి నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మోకాళ్ళ సర్జరీ అయిన తరువాత చిరంజీవికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు, ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటోలు బయటకు రావడం, అందులో ఆయన మామూలుగానే నిలబడి ఉండడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఈరోజు సినీ మీడియా మొత్తానికి అల్లు అర్జున్ ఒక భారీ పార్టీ కూడా అరేంజ్ చేశారు. రేపు ఉదయం ఈ అవార్డు అనౌన్స్ చేసిన అంశానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)