షార్ట్ సర్క్యూట్ తో బరేలీ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో అగ్నిప్రమాదం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 17 August 2023

షార్ట్ సర్క్యూట్ తో బరేలీ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌లో అగ్నిప్రమాదం !


త్తరప్రదేశ్ లోని బరేలీ నగరంలోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన సమయంలో బ్యాంకులో ఖాతాదారులు, బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మొదటి అంతస్తులోని అద్దాలను పగులగొట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన సమయంలో బ్యాంకు శాఖ ఆవరణలో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు, బ్యాంకు ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. మంటలు చెలరేగడంతో భయాందోళన నెలకొంది. బ్యాంకులో ఉన్న వారందరినీ సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మరోవైపు అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని బ్యాంకు యంత్రాంగం అంచనా వేస్తోంది. బ్యాంకులో అమర్చిన అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చామని, పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించి చీఫ్ ఫైర్ ఆఫీసర్ చంద్రమోహన్ శర్మ మాట్లాడుతూ సివిల్ లైన్స్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లోని మొదటి అంతస్తులోని ఓ గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, వెంటనే ఆవరణ మొత్తం పొగ వ్యాపించిందని తెలిపారు.

No comments:

Post a Comment