మిల్క్‌షేక్ తాగి ముగ్గురు మృతి !

Telugu Lo Computer
0


మెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ఓ బర్గర్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకారం  ఫిబ్రవరి 27, జూలై 22 మధ్య లిస్టెరియా ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న 6 మంది ఆసుపత్రిలో చేరారు. వారిలో ముగ్గురు మరణించారు. లిస్టెరియా ఇన్ఫెక్షన్ లక్షణాల విషయానికి వస్తే.. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, జీర్ణశయాంతర సమస్యలు తలెత్తుతాయి.  కాగా, ఈ ఘటనతో మిల్క్ షేక్ వల్ల ఆరోగ్యానికి హానీకరమా? అనే చర్చ జరుగుతోంది. బాధితులు తిన్న మిల్క్‌షేక్‌లో లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. లిస్టేరియోసిస్  లిస్టేరియా మోనోసైటోజెన్స్ అని పిలువబడే బ్యాక్టీరియాతో కలిసి ఆహారాన్ని కలుషితం చేస్తుంది. దీన్ని తినడం వలన తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వస్తుంది. వాషింగ్టన్‌లోని టాకోమాలో ఫ్రూగల్స్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్ విక్రయిస్తారు. అయితే, వీటిని యంత్రాల సాయంతో చేస్తారు. ఈ యంత్రాలను శుభ్రం చేయలేదు. దాని ఫలితంగానే లిస్టెరియా ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తి చేసే బ్యాక్టీరియా వ్యాప్తి చెందడానికి ఇదే కారణంగా పేర్కొంటున్నారు విచారణాధికారులు. లిస్టెరియా అనేది ఆహారం ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా వ్యాధిగా పరిగణించబడుతుంది. లిస్టెరియాతో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా చల్లని ఉష్ణోగ్రతలో కూడా జీవించగలదు. పరిశోధకులు రెస్టారెంట్‌లోని ఐస్‌క్రీమ్ మెషీన్‌లలో లిస్టెరియా బ్యాక్టీరియాను కనుగొన్నారు. యంత్రాలను శుభ్రం చేయడం లేదని, దాని కారణంగా ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందిందని గుర్తించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)