ఒడెసా నౌకాశ్రయం నుంచి 30 వేల టన్నుల సరకుతో కదిలిన నౌక !

Telugu Lo Computer
0


క్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్య ఒప్పందం నుంచి వైదొలగినప్పటి నుంచి నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ నౌకాశ్రయాలపై నిరంతరం దాడులు చేస్తున్న రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఒడెసా నౌకాశ్రయం నుంచి 30 వేల టన్నుల సరకుతో ఓ నౌక బయల్దేరింది. ఇందులో ఆహార ఉత్పత్తులూ ఉన్నాయి. తమ సహకారం లేకుండా నల్లసముద్రం గుండా రవాణా సాగనీయబోమని రష్యా ఇటీవల హెచ్చరికలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఒడెసాను లక్ష్యంగా చేసుకుంటూ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తూ వచ్చింది. అయితే ఆ హెచ్చరికలను తాము పట్టించుకోబోమని ఉక్రెయిన్‌ చెబుతూ వస్తోంది. అంతర్జాతీయ సహకారం లభిస్తే.. తాము ఎగుమతులు చేయడానికి సిద్ధమని ప్రకటించింది. చివరకు తన పంతం నెగ్గించుకుంది. ఒడెసా నౌకాశ్రయం నుంచి నౌక బయల్దేరినట్లు అమెరికా కూడా ధ్రువీకరించింది. మరోవైపు డాన్యూబ్‌ నది తీరంలోని నౌకాశ్రయాలపై, గోదాములపై బుధవారం రష్యా.. డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)