సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ తొలగింపులో బెంగళూరు టాప్‌ !

Telugu Lo Computer
0


సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్స్ (టెకీల) తొలగింపులో బెంగళూరు టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఐటీ ఉద్యోగాలు ఎక్కువ ఉన్న నగరంలోనే టెకీల తొలగింపు ఎక్కువగా ఉంది. ఇప్పటికే లేఆఫ్స్‌డౌన్‌ ట్రెండ్‌ కొనసాగుతుండగా,  ఇదే పరిస్థితి తిరిగి కొన్ని కంపెనీల్లో అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే మరికొంత మంది టెకీలకు ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడనుంది. టెకీల తొలగింపు 2022తో పోల్చితే .. 2023 తొలి 6 నెలల్లో అధికంగా ఉన్నట్టు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ సర్వే నివేదికలో వెల్లడయింది. లేఆఫ్స్‌ పెరుగుదలతో టెకీలకు మళ్లీ కష్టాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా టెకీల ఉద్వాసన పర్వం ఉధృతమవుతోంది. అమెరికా, ఐరోపాతో పాటు పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడంతో ఐటీ, ఇతర కంపెనీల లాభాలు తగ్గిపోయాయి. ఆర్థికరంగ ఒడిదొడుకుల కారణంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల సంఖ్య కూడా క్రమంగా తగ్గు ముఖం పట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 2,13,020 మంది టెకీలకు ఉద్వాసన (2023, జనవరి నుంచి జూన్‌) పలికినట్టు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ వెబ్‌సైట్‌ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది మొత్తంలో 45,166 టెకీలు ఉద్యోగాలు కోల్పో గా.. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో లేఆఫ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగులను తొలగించిన జాబితాలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహు, మెటా, జూమ్‌ ఉన్నాయి.

దేశంలో కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఇండియాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ దాకా 10,774 మంది టెకీలను తొలగించినట్టు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ నివేదిక వెల్లడించింది. 2022లో ఉద్వాసనకు గురైన టెకీ ఉద్యోగుల సంఖ్య 6,530 మంది కాగా.. ఈ ఏడాదితో పోల్చి చూసినప్పుడు తొలి ఆరునెలల్లో టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నవారే అధికంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్‌ విజృంభించిన 2020లోనూ భారత్‌లోని 12,932 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పో యారు. 2021లో కొత్త స్టార్టప్‌లకు ఫండింగ్‌ పెరిగింది. దీంతో ఈ సంఖ్య 4,080కు తగ్గింది. టెకీల తొలగింపులో భారత్‌లో బెంగళూరు మహానగరం మొదటి వరుసలో ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే అక్కడ 6,967 మంది ఉద్యోగాలు కోల్పోయారు. స్టార్టప్‌ హబ్‌గా రూపొందుతున్న క్రమంలో ఈ ప్రభావం అధికంగా పడినట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో లేఆఫ్‌లు పెద్దగా లేకపోవడంతో లేఆఫ్స్.ఎఫ్‌వైఐ నివేదికలో టెకీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన గణాంక వివరాలు పొందుపరచలేదు. గత శీతాకాలం నుంచి ఇప్పటిదాకా 107 ఇండియన్‌ స్టార్టప్‌లలో 28,046 మంది ఉద్యోగులకు లే ఆఫ్‌ సెగ తాకినట్టు ఐఎన్‌సీ 42 తాజా నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో 22 భారత ఎడ్‌టెక్‌ స్టార్టప్‌లు 9,871 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని.. 59 స్టార్టప్‌లు 9,271 మంది ఉద్యోగులను తొలగించినట్టు పేర్కొన్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)