కేరళలో ఐదు రోజుల్లో భారీ వర్షాలు

Telugu Lo Computer
0


కేరళలో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ  తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తీవ్రత పెరగడమే ఇందుకు కారణమని చెప్పింది. జూలై 3 నుంచి 5 వరకు కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో 115.6 మిమీ నుంచి 204.4 మిమీ వరకు భారీ వర్షపాతం నమోదు కానున్నట్టు తెలుస్తోంది. కోజికోడ్ జిల్లాలో జూలై 5న అత్యధిక వర్షాలు కురుస్తాయని, జిల్లాలో 204.4 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు తీవ్రమై పరిస్థితి మరింత దారుణంగా మారితే, తీరప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. కేరళ, కర్నాటక, లక్షద్వీప్‌లలో జూలై 5 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను ఆదేశించింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)