మధుమేహం - ఇంటి చిట్కాలు !

Telugu Lo Computer
0


ధుమేహం సమాజాన్ని పట్టిపీడిస్తోంది. ప్రతి వంద మందిలో 80 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మధువేహం కారణంగా శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోక పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఇంగ్లీషు మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మంది ఆందోళన పడుతూంటారు. అలాంటి వారు ఇంటి చిట్కాలతో కూడా మధువేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో మెంతులు మంచి పాత్రను పోషిస్తాయి. ప్రతి రోజూ ఒక పరిమితిలో మెంతులను మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే డయాబెటిస్ ను అదుపులోకి తీసుకురావచ్చు. అలాగే రాత్రి సమయంలో మెంతులను నానబెట్టి.. ఉదయం ఆ నీళ్లను తాగి, ఆ మెంతులను తింటే కూడా మధుమేహం కంట్రోల్ లోకి రావచ్చు. మధుమేహాన్ని నియంత్రించడంలో కాకరకాయ ముఖ్యంగా పని చేస్తోంది. కాకర రసాన్ని తాగడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. పచ్చి కాకర కాయలు తిన్నా, కాకరకాయ రసాన్ని తాగిన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయని చెబుతున్నారు. కరివేపాకులో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే కరివేపాకును ప్రతిరోజు 2 రెమ్మలు తుంచుకుని తింటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. షుగర్ తో బాధపడే వారు శారీరకంగా చాలా యాక్టీవ్ గా ఉండాలి. ప్రతిరోజు వ్యాయమం చేయడానికి సమయం కేటాయించాలి. 15 నిమిషాల పాటు కనీసం మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో మూడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే గ్లూకోజ్ లెవెల్స్ కూడా బాగుంటాయి. మధుమేహంతో బాధపడేవారు ఫ్రై పదార్థాలు, ప్యాకెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి చాలా దూరంగా ఉండాలి. అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ.. ఒత్తిడిని దరిచేరనివ్వకుండా ఉంటే షుగర్ కి బైబై చెప్పవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)