మైక్‌ కట్‌ చేసి నన్ను అవమానపరిచారు !

Telugu Lo Computer
0


ణిపూర్‌ హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో వివరణ ఇవ్వాలని విపక్ష సభ్యులు ఉభయ సభల్లో పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో రాజ్యసభలో మాట్లాడుతున్న క్రమంలో మైక్‌ కట్‌ చేయడం పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు, విపక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది తన ఆత్మాభిమానాన్ని సవాలు చేయడమేనన్న ఆయన.. ఛైర్మన్‌ అనుమతితో మాట్లాడుతున్నప్పటికీ మైక్‌ కట్‌ చేయడం తనను అవమానించడమేనన్నారు. బుధవారం ఉదయం ఎగువసభ ప్రారంభమైన తర్వాత మాట్లాడిన మల్లికార్జున ఖర్గే, పలు అంశాలను సభ దృష్టికి తీసుకువస్తున్నాని చెప్పారు. '267 కింద 50మంది నోటీసులు ఇచ్చినప్పటికీ పార్లమెంటులో మాట్లాడేందుకు నాకు అవకాశం రాలేదు. కనీసం నేను మాట్లాడేటప్పుడైనా, అది పూర్తికాకుండానే నా మైక్‌ను ఆఫ్‌ చేశారు. ఇది నా హక్కులకు భంగం కలిగించడమే. ఇది నాకు అవమానకరమే. వాళ్లు నా ఆత్మగౌరవాన్ని సవాలు చేశారు. ఒకవేళ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సభ నడుస్తుందనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదనే నేను భావిస్తా' అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంగళవారం సభలో చోటుచేసుకున్న వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ అధికార పక్షం తీరుపై మల్లికార్జున ఖర్గే తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత అలా మాట్లాడిన వెంటనే విపక్షసభ్యులు ఆయనకు మద్దతుగా నిలిచి నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా ' మోడీ  మోడీ' అంటూ ప్రతి నినాదాలు చేయడంతో సభ మొత్తం గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో సభను క్రమపద్ధతిలోకి తీసుకురావాలని విపక్షనేత ఖర్గేతో పాటు సభాపక్షనేత పీయూష్‌ గోయల్‌లకు ఛైర్మన్‌ జన్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఇరుపక్షాల సభ్యుల నినాదాలతో ఎగువసభ హోరెత్తిపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)