దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే డీకే శివ కుమార్ ?

Telugu Lo Computer
0


దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సమరం మొదలుకానున్న నేపథ్యంలో  పోటీ చేసిన అభ్యర్థుల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనం చేసింది. ఇందులో దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యే, అత్యంత పేదవాడైన ఎమ్మెల్యే ఎవరని విషయాన్ని బయటపెట్టింది. అత్యంత సంపన్నుడిగా నిలిచిన డీకే శివకుమార్ ఆస్తులు రూ.1,400 కోట్లు. ఇందులో ఆయన స్థిరాస్థులు రూ.273 కోట్లు, చరాస్తులు రూ.1140 కోట్లు కాగా, అప్పులు రూ.265 కోట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల సందర్భంగా దేశంలోనే అత్యంత సంపన్నుడిగా కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ అని తేలింది. అత్యంత పేదవాడిగా ఉన్న ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా.. ఆయన పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే ఆస్తి కేవలం రూ.1700 మాత్రమేనని అఫిడవిట్‌లో దాఖలు చేశారు. దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేనన్న నివేదికపై డీకే శివ కుమార్ స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తాను సంపన్నుడినీ కాదని అలా అని పేదవాడినీ కాదన్నారు. ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ ఒక్కసారిగా వచ్చి పడినవి కావని, సుదీర్ఘకాలం కష్టపడి సంపాదించుకున్నవి అన్నారు. డీకే శివ కుమార్ తర్వాత స్థానంలో రూ.1267 కోట్ల ఆస్తులతో గౌరిబిదనూర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి నిలిచారు.1,156 కోట్లతో కాంగ్రెస్‌కు చెందిన ప్రియా కృష్ణ తర్వాతి స్థానంలో ఉన్నారు. టాప్ టెన్‌లో ఉన్న అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలలో నలుగురు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, ముగ్గురు బీజేపీకి చెందిన వారు కావడంతో పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా దేశంలోని 20 మంది సంపన్న ఎమ్మెల్యేలలో 12 మంది కర్ణాటకకు చెందిన వారు కావడం గమనార్హం. అంతేకాకుండా రాష్ట్రంలో 14 శాతం ఎమ్మెల్యేలు బిలియనీర్లుగా ఉన్నారు. వాళ్ల ఆస్తులు కనీసం ₹ 100 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, వీరిలో 59 మంది ఎమ్మెల్యేలలో 4 మంది బిలియనీర్లగా ఉన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)