టోల్‌ గేట్ ఉద్యోగినిపై మహిళ దాడి

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లో టోల్ పేమెంట్ చేయాలని అడిగినందుకు టోల్‌ ఫ్లాజా ఉద్యోగినిపై ఓ మహిళ దాడి చేసింది. జుట్టు పట్టుకుని కింద పడేసింది. ఈ అమానవీయ ఘటన జాతీయ రహదారి 91పై జరిగింది. సీసీటీవీ ఆధారంగా రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అయ్యాయి. టోల్‌ ఫ్లాజా వద్ద ఉన్న క్యాబిన్‌లోకి ఓ మహిళ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అక్కడ ఉద్యోగినితో వాగ్వాదానికి దిగింది. ఉద్యోగిని జుట్టు పట్టుకుని దాడి చేసింది. బాధితురాలిని బూతులు తిడుతూ కింద పడేసింది. సహచర ఉద్యోగులు చొరవ తీసుకుని ఆ మహిళను నిలువరించే ప‍్రయత్నం చేశారు. ఈ ఘటనపై టోల్ ఫ్లాజా యాజమాన్యం సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ టోల్‌ ఫ్లాజాకు సమీప గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఐడీ కార్డు అడిగిన నేపథ్యంలో గొడవ ప్రారంభమైనట్లు చెప్పారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)