మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ !

Telugu Lo Computer
0


క్రమాలకు పాల్పడిన బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర బ్యాంకులపై చర్యలు తీసుకుంది. అదే తరహాలో ప్రస్తుతం మరొక బ్యాంకు లైసెన్స్ రద్దు చేసింది. ఈ కీలక నిర్ణయాన్ని జూలై 19 నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొంది.  ఉత్తర ప్రదేశ్ కేంద్రంగా పని చేస్తున్న యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బిజ్నోర్ ఇక కనబడదు. ఈ బ్యాంక్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఈ బ్యాంక్‌లో తగినంత మూలధన నిల్వలు లేవని.. ఆదాయ అంచనాలు కూడా కనబడని కారణంతో లైసెన్స్ రద్దు చేసినట్లు ప్రకటించింది. 2023 జూలై 19 న బ్యాంక్ సమయం ముగిసినప్పటినుండి ఈ బ్యాంక్ పనులను నిర్వహించకూడదు. మూలధనం లేని బ్యాంక్, ఆదాయ అంచనాలు లేని బ్యాంక్‌లను కొనసాగించడం కస్టమర్ల ప్రయోజనాలకు దెబ్బతీసినట్లు అవుతుందని ఆర్ బీఐ తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థను కొనసాగిస్తే ఖాతాదారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఖాతాదారులు ఈ బ్యాంక్‌లో డిపాజిట్ చేయొద్దని సూచించింది. అయితే ఈ బ్యాంక్ లో 99.98 శాతం మంది డిపాజిటర్లు DICGC నుంచి పూర్తి డబ్బులు తీసుకునే అవకాశం కల్పించింది. DICGC కింద గరిష్టంగా రూ. 5 లక్షల వరకు నగదు డిపాజిట్ చేసిన కస్టమర్ల చేతికి అందుతాయి. గత సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ సంవత్సరం మార్చి వరకు ఏకంగా 9 కో ఆపరేటివ్ బ్యాంక్‌ల లైసెన్స్ రద్దు చేసింది. అంతేకాకుండా పలు బ్యాంకులపై 114 సార్లు పెనల్టీ విధించింది. కొన్ని రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ కర్ణాటక లో శ్రీ శారదా మహిళా కో ఆపరేటివ్ బ్యాంక్, మహారాష్ట్ర సతారాలోని హరిహరేశ్వర్ సహకారీ బ్యాంక్, మహారాష్ట్ర బుల్డానాలో మల్కాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, కర్ణాటక బెంగుళూరులోని శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంకుల లైసెన్స్ లు క్యాన్సిల్ చేసింది. గ్రామాల్లో, సెమీ రూరల్ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సర్వీసులను మరింత విస్తరించడంలో కోఆపరేటివ్ బ్యాంకులు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)