టాయిలెట్ కోసం వందేభారత్‌ ఎక్కి.....!

Telugu Lo Computer
0

ధ్యప్రదేశ్‌ లోని సింగ్రౌలీకి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా హైదరాబాద్‌ నుంచి భోపాల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. భోపాల్‌ నుంచి సింగ్రౌలీ వెళ్లేందుకు మరో రైలు కోసం ఫ్లాట్‌ఫామ్‌పై వేచి చూస్తున్నాడు. అదేసమయంలో మూత్ర విసర్జన కోసం అప్పుడే ఫ్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన వందేభారత్‌ రైలులోకి వెళ్లాడు. టాయిలెట్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైలు దిగిపోయేందుకు ప్రయత్నించగా, అప్పటికే ట్రైన్‌ తలుపులు మూసుకోవడంతో లోపలే ఉండిపోయాడు. తర్వాత రైలు కదలడంతో టీటీఈని సంప్రదించాడు. రైలు ఉజ్జయిని స్టేషన్‌లో ఆగుతుందని టీటీఈ చెప్పడంతో చేసేదేంలేక లోపలే ఉండిపోయాడు. టికెట్‌ లేకుండా రైలు ఎక్కినందుకు రూ. 1,020 ఫైన్ చెల్లించాడు. తర్వాత రైలు ఉజ్జయిని స్టేషన్‌లో ఆగడంతో అక్కడ దిగిపోయాడు. ఈ క్రమంలో తన కుటుంబం భోపాల్‌ స్టేషన్‌లోనే ఉండిపోవడంతో ఉజ్జయిని నుంచి బస్‌ టికెట్‌కు రూ. 750 చెల్లించి భోపాల్ చేరుకున్నాడు. అప్పటికే  వారు సింగ్రౌలీ వెళ్లేందుకు రూ. 4 వేలు చెల్లించి టికెట్లు బుక్‌ చేసుకున్న రైలు వెళ్లిపోయింది. దీంతో, మొత్తంగా సుమారు రూ. 6 వేలు నష్టపోయినట్లు తెలిపాడు. ఈ ఘటనపై భోపాల్‌ స్టేషన్‌ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వందే భారత్‌ రైలు కదిలే ముందుగా తలుపులు ఏ వైపు తెరుచుకుంటాయి, ఎటువైపు లాక్‌ చేసి ఉంటాయనేది ప్రయాణికులకు తెలిసేలా ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. రైలు కదిలే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల భద్రత కోసమే ఆధునిక డోర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)