శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నపశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (79) శనివారం ఆస్పత్రిలో చేరారు. పామ్ అవెన్యూ నుండి ఆయనను గ్రీన్ కారిడార్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. గుండె, ఊపిరితిత్తుల నిపుణులతో కూడిన సీనియర్ వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఐసియులో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ''ఆయన పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స అందిస్తున్నాం. శరీరంలో ఆక్సీజన్ స్థాయి 70కి పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించాం'' అని అధికారులు తెలిపారు. భార్య మీరా భట్టాచార్య, కుమార్తె సుచేతనా భట్టాచార్య ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపారు. 2000 నుండి 2011 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కొంతకాలంగా సిఒపిడి (ఊపిరితిత్తుల వ్యాధి)తో పాటు వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. 2015లో సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ నుండి వైదొలగగా, 2018లో రాష్ట్ర కార్యదర్శివర్గం నుంచి కూడా వైదొలిగారు. https://t.me/offerbazaramzon

No comments:
Post a Comment