రెండు కో ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ల రద్దు !

Telugu Lo Computer
0


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగారెండు  బ్యాంకులు  లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. ఇకపై ఈ బ్యాంకులు కనిపించవు. వీటిలో శారదా మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. ఇది కర్నాటక కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిహిస్తోంది. అలాగే హరిహరేశ్వర్ సహకారి బ్యాంక్ లైసెన్స్ కూడా ఆర్‌బీఐ క్యాన్సిల్ చేసింది. బ్యాంకులు వద్ద సరిపడినంత మూలధనం లేకపోవడ వల్ల వాటి లైసెన్స్ రద్దు చేయాల్సి వచ్చిందని ఆర్‌బీఐ వెల్లడించింది. అలాగే వీటి వద్ద ఆదాయ అంచనాలు కూడా లేవని తెలిపింది. హరిహరేశ్ర్ సహకారి బ్యాంక్ బ్యాంకింగ్ బిజినెస్ జూలై 11 నుంచి క్లోజ్ అయ్యిందని ఆర్‌బీఐ వెల్లడించింది. అంటే ఇప్పటికే ఈ బ్యాంక్ బ్యాంకింగ్ కార్యకలాపాలు మూతపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే బ్యాంక్ ఖాతాదారులకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 99.96 డిపాజిట్ దారులకు వారి డబ్బులు వెనక్కి వచ్చేస్తాయని తెలిపింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యాంరటీ కార్పొరేసన్ (డీఐసీజీసీ) కింద వీరికి డబ్బులు వెనక్కి వస్తాయని వివరించింది. శారదా మహిళా కోఆపరేటివ్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఈ బ్యాంక్‌లో 97.82 శాతం మందికి డబ్బులు తిరిగి పూర్తిగా వెనక్కి వచ్చేస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. డీఐసీజీసీ స్కీమ్ కింద బ్యాంక్‌లో రూ. 5 లక్షల వరకు డబ్బులు దాచుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. పూర్తి డబ్బుల వచ్చేస్తాయి. అయితే రూ. 5 లక్షలకు మించి ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేసుకుంటే మాత్రం అప్పుడు ఆ డబ్బులు రావు. అందు వల్ల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డిపాజిట్ మొత్తం, దీనిపై వచ్చిన వడ్డీ రెండూ కలిపి రూ. 5 లక్షల వరకు చెల్లిస్తారు. కాగా ఈ 2 బ్యాంకులు ఇకపై డిపాజిట్లు స్వీకరించడం, చెల్లించడం వంటి పనులు చేయకూడదు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)