పది వేల లోపు ఉన్న అర్చకుల వేతనం పెంపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ లో పది వేల లోపు ఉన్న అర్చకులకు 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని   దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు  ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఇక, టెంపుల్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.. మరోవైపు, టెంపుల్స్‌లో సాంకేతిక సిబ్బంది కొరత ఉందని అంగీకరించారు..అయితే, ఆ కొతరను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  కాగా, ఇప్పటికే రాష్ట్రంలో ఉండే కేటగిరి 1 దేవస్థానాలలో పనిచేసే అర్చకులకు గౌరవ వేతనం రూ. 15,625, కేటగిరి-2లో అర్చకులకు గౌరవ వేతనం రూ. 10 వేలు ఇస్తూ వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా.. అర్చకులకు 100 శాతం వైద్య ఖర్చులు కూడా భరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పటి వరకు రూ.10 లోపు గౌరవ వేతనం ఉన్న అర్చకులకు.. రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించారు.. దీంతో, రాష్ట్రంలో 1,146 మంది అర్చకులకు లబ్ధిచేకూరనుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)