మహాత్మా గాంధీ, మండేలా, జిన్నా నాకు స్ఫూర్తి !

Telugu Lo Computer
0


నను అణచివేసేందుకు ఎన్ని అభియోగాలు మోపినా అరెస్టు చేసి జైల్లో పెట్టినా  వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన మహాత్మా గాంధీ, నెల్సన్‌ మండేలా వంటి దిగ్గజ నేతలతో తనను పోల్చుకున్నారు. 'వాళ్లు నన్ను మళ్లీ జైల్లో పెడతారని తెలుసు. దానికి సమయం ఏమీ పట్టదు. ఎందుకంటే నేను బయట ఉంటే నా పార్టీకి ఎంతో బలం ఉంటుందనే భయం వారిలో ఉంది. అందుకే మమ్మల్ని జైల్లో పెట్టి ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు వేల మంది పీటీఐ కార్యకర్తలను నిర్బంధించారు. మా పార్టీకి భయపడే నన్ను జైలుకు పంపించేందుకు యత్నిస్తున్నారు. తద్వారా నాపై అనర్హత వేటు వేయాలన్నది వారి వ్యూహం. అయినప్పటికీ నేను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతూనే ఉన్నా. మమ్మల్ని ఎంత అణచివేసేందుకు ప్రయత్నిస్తే పార్టీకి అంత మద్దతు లభిస్తుంది' అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎటువంటి లక్ష్యాలు లేవని, నెల్సన్‌ మండేలా, మహాత్మా గాంధీలతోపాటు మహమ్మద్‌ అలీ జిన్నా వంటి నేతల అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. 'రాజకీయాలే కెరీర్‌గా నేను ఇందులోకి రాలేదు. రాజకీయాలను వృత్తిగా భావించేందుకు నేను ఎవ్వరినీ ప్రోత్సహించను. నా కుమారులను కూడా రాజకీయాల్లోకి రావద్దనే చెబుతా. ఎందుకంటే అదో వరస్ట్‌ కెరీర్‌. రాజకీయాలంటే ఓ లక్ష్యంతో కూడుకున్నవి. నెల్సన్‌ మండేలా, మహాత్మాగాంధీ, జిన్నాలాంటి వాళ్లు స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. వారు నిస్వార్థ సేవకులు. అందుకే వారు నాకు స్ఫూర్తి. వారెప్పుడూ అధికారం కోసం ప్రయత్నించలేదు. ఓ లక్ష్యం కోసం పోరాడారు' అని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తాము ఓ లక్ష్యంతో పనిచేస్తున్నామని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పీటీఐదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇమ్రాన్‌పై ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో కేసులు నమోదు చేసింది. అవినీతి, హత్యలు, దాడులు, దేశద్రోహం, ఉగ్రవాదం వంటి దాదాపు 170 కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని, కేవలం ఇమ్రాన్‌ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ అభియోగాలు మోపుతున్నారని ఇమ్రాన్‌ పార్టీ ఆరోపిస్తోంది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)