మధుమేహం - తినకూడని పదార్థాలు !

Telugu Lo Computer
0


ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది డయాబెటిస్ కు గురయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అందరూ పరీక్షలు చేయించుకుంటే ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. మధుమేహం ఉన్న వాళ్లు పళ్లు తినకూడదంటారు కానీ, చిన్నప్పటినుంచి పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తింటే షుగర్‌ సమస్య రాదు. షుగర్‌ ఉన్నవారు కూడా ఒక పద్ధతిలో పిండిపదార్థాలను బాగా తగ్గించి పొద్దున, సాయంత్రం ఖాళీ కడుపున పండ్లు తీసుకోవడం మంచిది. అయితే బాగా తియ్యగా వుండే మామిడి, ద్రాక్ష లాంటివి కాకుండా దోర జామ, కివి, బొప్పాయి లాంటివి మంచిది. తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలలో కూడా ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. షుగర్ వున్న వారికి బీపీ తోడవుతుంది కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. టైమ్ ప్రకారం భోజనం చేయాలి, అన్నం తగ్గించి జొన్న, సజ్జ, గోధుమ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. టీ, కాఫీ తగ్గించాలి, వాటి కంటే లెమన్ టీ, అల్లం టీ మంచిది.

నూనెలో బాగా వేయించిన వడియాలు, అప్పడాలు తినకూడదు. అలాగే వడలు, పూరీలు, బజ్జీలు, మైదాతో చేసినవి తగ్గించాలి, లేదా ఆపేయాలి. స్వీట్లు, ఐస్‌క్రీమ్స్‌, చక్కెర పదార్థాలు, అరటి పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. డయాబెటస్‌ పేషెంట్స్‌ తినకపోవడమే మంచిది. పండ్లతో పోలిస్తే జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి అవి తీసుకోకపోవడమే మంచిది. ప్రాసెడ్‌ ఫుడ్స్‌కి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు వైద్యులు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)