మ్యూజికల్ రోడ్డు ఆలోచన అద్భుతం !

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన ఎప్పుడు ఎలాంటి వీడియో షేర్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. నెటిజన్లను కూడా విపరీతంగా ఆకట్టుకునేలా ఉంటుంది. తాజాగా మహీంద్రా ఓ కొత్త వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు. హంగేరీ లోని మ్యూజికల్ రోడ్డును నెటిజన్లకు పరిచయం చేశారు. అక్కడ సంగీత వాయిద్యాలను రోడ్డుపై చారలుగా గీశారు. వాహనం ఆ వాయిద్యాల చారలపై వెళ్లగానే మ్యూజిక్ రావడం గమనించొచ్చు. వీడియో షేర్ చేసిన మహీంద్రా.. ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉందని అన్నారు. మన జాతీయ రహదారులు కూడా ఇలా సంగీతం వినిపించేలా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)