మోడీపై ఇండియాకు విశ్వాసం ఎందుకుంటుంది ?

Telugu Lo Computer
0


ణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రకటన చేసే విశ్వాసం ప్రధాని నరేంద్ర మోడీకి కొరవడితే ఆయనపై ఇండియా (ప్రతిపక్ష కూటమి)కు నమ్మకం ఎలా కలుగుతుందని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కపిల్ పిబల్ బుధవారం ప్రశ్నించారు. మణిపూర్ హింసాకాండపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో కపిల్ సిబల్ ఒక ట్వీట్ చేస్తూ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో ప్రకటన చేసే విశ్వాసం ప్రధాని మోడీకి కొరివడితే, సుప్రీంకోర్టు వ్యాఖ్యానించేవరకు మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలపై మౌనం వహిస్తే, బ్రిజ్ భూషణ్‌పై మౌనం పాటిస్తే, భారత సరిహద్దులను చైనా ఆక్రమించుకోలేదని చెబుతుంటే..ఆయనపై ఇండియా(ప్రతిపక్ష కూటమి)కు ఎలా విశ్వాసం ఉంటుంది. ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ పాల్గొన్న సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం జరిగింది అంటూ సిబల్ ట్వీట్ చేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)