ధారావి మురికివాడకు పర్యాటకుల క్యూ !

Telugu Lo Computer
0


సియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడ ముంబై లోని ధారావి. దీనిని సుందరంగా మార్చే బాధ్యతను ఆదానీ గ్రూప్‌ తన చేతుల్లోకి తీసుకుంది. అయితే మహారాష్ట్రలోని రాజకీయ ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టు నుంచి అదాని గ్రూపును తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా ఇటీవలి కాలంలో ఈ భారీ స్లమ్‌ ఏరియాకు పర్యాటకులు తాకిడి మరింతగా పెరిగింది. ప్రతీయేటా వేలాదిమంది విదేశీయులు ఈ స్లమ్‌ ఏరియాను సందర్శించేందుకు వస్తున్నారు. ఇక్కడి పేదల దుర్భర పరిస్థితులను అసక్తిగా గమనిస్తున్నారు. దేశంలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చేవారికన్నా ఈ స్లమ్ ఏరియాకే అధికంగా పర్యాటకులు వస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. 18వ శతాబ్ధంలో కొందరు మత్స్యకారులు తమ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. కూలీనాలీ చేసుకుంటూ ఇక్కడే ఉంటూ వచ్చారు. తరువాతి కాలంలో వివిధ వృత్తుల వారు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 20 వ శతాబ్ధం నాటికి ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. స్కూళ్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆసుపత్రులు ఇలా అన్ని సౌకర్యాలు ఈ ప్రాంతంలో సమకూరాయి. ప్రస్తుతం ఇది ఆసియాలో అతి పెద్ద మురికివాడగా పేరొందింది. సుమారు 550 ఎకరాల్లో విస్తరించిన ధారావి, లెక్కకుమించిన గుడిసెలు కలిగిన బస్తీలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడి ఒక్కో గుడిసెలోనూ 10 మందికిపైగా వ్యక్తులు ఉంటున్నారు. దీనిని పరిశీలించి చూస్తే ఇక్కడి జనాభా ఎంత అధికమో తెలుస్తుంది. ధారావి మురికివాడలో 10 లక్షలకు పైగా జనాభా ఉండవచ్చని అంచనా. ఇక్కడికి వచ్చే టూరిస్టులు గంటల తరబడి ఇక్కడే ఉంటూ, ఇక్కడి పరిస్థితులను గమనిస్తుంటారు. పేదలు ఎలా జీవిస్తుంటారు ? వారి దినచర్య ఎలా ఉంటుందనేది వీరు గమనిస్తారు. ఈ నేపధ్యంలో పలు అంశాలకు సంబంధిచిన వీడియోలు తీసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)