విపక్ష భేటీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ దాడులు

Telugu Lo Computer
0


బెంగళూర్‌లో జరుగుతున్న విపక్ష నేతల భేటీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుపై పొన్ముడి న్యాయ పోరాటం సాగిస్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. మనీల్యాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత పొన్ముడి, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. పొన్ముడి కుమారుడు, ఎంపీ గౌతం సిగమణి నివాసాల్లోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నై, విల్లుపురంలోని తండ్రీ కొడుకుల నివాసాలు, ఆస్తులపై ఈడీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మోడీ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీతో దాడులు చేయిస్తోందని పాలక డీఎంకే ఆరోపించింది. బెంగళూర్‌లో విపక్ష నేతల భేటీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే దాడులు జరుగుతున్నాయని, ఈ కేసుపై పొన్ముడి న్యాయ పోరాటం సాగిస్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. గవర్నర్ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారని, ఇప్పుడు ఈడీ కూడా బీజేపీ తరపున బరిలో దిగిందని దుయ్యబట్టారు. ఇదంతా ఎన్నికల్లో తమ అనుకూలతను పెంచుతుందని, ఈ డ్రామాలు బీజేపీకి అలవాటేనని ఆరోపించారు. పొన్ముడిపై ఇటీవల రెండు కేసులు కొట్టివేశారని, ఈ కేసును ఆయన న్యాయపరంగా ఎదుర్కొంటారని అన్నారు. పొన్ముడి 2007-2011 మధ్య రాష్ట్ర మైనింగ్ మంత్రిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి మనీల్యాండరింగ్ కేసు ఎదుర్కొంటున్నారు. క్వారీ లైసెన్స్ నిబంధనలను పొన్ముడి ఉల్లంఘించడంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 28 కోట్ల నష్టం వాటిల్లిందనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)