టెర్రస్ మీద కాఫీ తాగుతున్న మహిళపై ఆకాశం నుంచి పడిన ఉల్క !

Telugu Lo Computer
0


ఫ్రాన్స్‌లోని ఒక మహిళ తన స్నేహితురాలితో కలిసి టెర్రస్ మీద కూర్చొని కాఫీ తాగుతూ ఉంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక రాయి ఆమె శరీరంపై పడింది. అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. న్యూస్‌వీక్ కథనం ప్రకారం.. ఈ సంఘటన జూలై 6 న జరిగింది. తన స్నేహితుడితో కలిసి టెర్రస్‌పై కూర్చుని ఉన్నప్పుడు ఒక పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని మహిళ చెప్పింది. అప్పుడు లేచి నిల్చుని ఏమిటా అని చూస్తుండగా ఒక వస్తువు ఆ స్త్రీ మీద పడింది. అప్పుడు ఆ మహిళకు ఎముక విరిగిపోయిన ఫీలింగ్ కలిగింది. అప్పటి వరకు తనకు ఏమి జరిగిందో ఏమిటో తెలియకపోయినా? తనపై పడింది గబ్బిలాలు ఉండవచ్చని, అవి రాత్రి సమయంలో అక్కడక్కడ ఎగురుతూనే ఉంటాయని భావించింది. అంతేకాదు తనపై పడిన వస్తువు ఇటుక లేదా సిమెంట్ ముక్క కావచ్చు అని కూడా భావించింది. అయితే అక్కడ ఆమె నలుపు రంగులో ఉన్న రాయి వంటి వస్తువుని చూసింది. నివేదికల ప్రకారం మహిళ తనపై పడిన రాయిని సురక్షితంగా ఉంచింది. అంతేకాదు ఆ రాయిని పరీక్ష కోసం పంపింది. అప్పుడు తెలిసింది ఆ రాయి నిజానికి ఉల్క అని, అది నలుపు రంగులో ఉన్నప్పటికీ నక్షత్రంలా మెరుస్తూ ఉంది. భూవిజ్ఞాన శాస్త్రవేత్త థియరీ రెబ్‌మాన్ ఆ ముక్క సిలికాన్, ఇనుముతో చేసిన ఉల్క అని ధృవీకరించారు. ఉల్కలు భూమిపై తరచుగా పడతాయి. అయితే ఉల్క మనిషి మీద పడిన సంఘటనలు బహు అరుదు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)