బోరు బావిలో పడిన బాలుడిని సురక్షితంగా రక్షించిన సహాయక బృందాలు !

Telugu Lo Computer
0


బీహార్ లోని నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోపోయాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు బాలుడిని రక్షించేందుకు జేసీబీ యంత్రాలతో బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు చేశారు. బాలుడికి ఆక్సిజన్ అందేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందజేశారు. ఐదు గంటలపాటు అవిశ్రాంతంగా శ్రమించిన సహాయక బృందాలు చివరకు ఆ బాలుడిని కాపాడాయి. దీంతో అధికారులు, సిబ్బంది ఎంతో ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకుని అభినందనలు పంచుకున్నారు. ఇక ఆ బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నారిని శివమ్ కుమార్‌గా గుర్తించారు. కాగా, బోరు వేసి ఇలా మూసివేయకుండా ఉంచడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో దేశంలోని చాలా చోట్ల ఇలాంటి బోరు బావుల్లో పడి పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. అయినప్పటికీ.. ఇలాంటి బోరుబావుల ఘటనలు జరుగుతుండటం శోచనీయం. ప్రభుత్వాలు, అధికారులు ఇలాంటి బోరుబావులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)