1860 నాటి కెమెరాతో ఫోటోలు తీస్తున్న టికామ్ చంద్

Telugu Lo Computer
0


రాజస్తాన్ లో టికామ్ చంద్ అనే ఫోటోగ్రాఫర్ జైపూర్ హవా మహల్ బయట తన పాతకాలపు కెమెరాతో పర్యాటకులకు ఫోటోలు తీస్తుంటాడు. అతను చెప్పే దాని ప్రకారం ఈ కెమెరాను జైపూర్ మహారాజు తన పూర్వీకుడు పహారీ లాల్‌కు బహుమతిగా ఇచ్చాడు. పహారీ లాల్ రాజు అధికారిక ఫోటోగ్రాఫర్ అట. అతని దగ్గర నుంచి తమవరకూ ఈ కెమెరా వచ్చిందని టికామ్ చంద్ చెబుతాడు. ఈ కెమెరాను ఎలా ఆపరేట్ చేస్తారో చూపించే వీడియోను మరూఫ్ ఉమర్ పాడవుతుంటుంది.. ఇది ప్రపంచంలోనే చివరిది. ఈ కెమెరాలో ప్రతి నట్, బోల్ట్ గురించి టికామ్ చంద్‌జీకి మాత్రమే బాగా తెలుసు. కెమెరాలో డార్క్ రూమ్, ఫిక్సర్, డెవలపర్, ఫిల్మ్ బాక్స్ అన్నీ 20 కిలోల బరువు ఉంటాయి' అంటూ దీని గురించి మరూఫ్ పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'ఫోటోలు ఎంత క్వాలిటీగా అద్భుతంగా ఉన్నాయి' అంటూ ఒకరు.. 'రెండు వారాల క్రితం అక్కడి వెళ్లి ఫోటో దిగాము.. కెమెరా పనితనాన్ని మాకు టికామ్ చంద్ చక్కగా వివరించాడని' మరొకరు కామెంట్లు చేశారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)