మాకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు !

Telugu Lo Computer
0


దేశంలో ఏ పార్టీతోనూ వైసీపీకి పొత్తు లేదని, వైసీపీకి ఎవరి సహకారం అక్కర్లేదని, ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పార్టీలన్నీ కలిసి పోటీ చేయాలని మంత్రి గుడివాడ సూచించారు. తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేసిన వారే, ఇప్పుడు పువ్వులు వేస్తున్నారని మంత్రి అన్నారు. ఏపీలో ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలవని వారే, రాబోయే ఎన్నికల్లో 20 లోక్ సభ స్థానాలు కావాలంటన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ మాకు ఎంత గౌరవం ఇస్తుందో, మేము కూడా అంతే గౌరవిస్తాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న పథకాలన్నీ కేంద్ర నిధులతోనే ఇస్తున్నట్టుగా బీజేపీ ప్రచారం చేయడం సమంజసం కాదన్నారాయన. రాష్ట్ర విభజన కారణంగా నేటికీ ఇబ్బంది పడుతున్నామని మంత్రి గుడివాడ వాపోయారు. రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలు గాలికి వదిలేశారని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విభజన చట్టంలో ఉన్నవి ఇచ్చారు తప్ప, మిగిలినవి ఏం ఇచ్చారు? అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ని నిలదీశారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఏపీకి ఇసుక ద్వారా రూ.4వేల కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మరి.. 2014-2019 సంవత్సరాల్లో ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం ఏమైందని ప్రశ్నించారు. సుజనాచౌదరి, సీఎం రమేశ్, పురందేశ్వరి బీజేపీ నాయకులా? అని మంత్రి అడిగారు. చంద్రబాబును కాపాడటానికి వీళ్ళంత టీ-బీజేపీ అని విమర్శించారు. ”తొమ్మిది సంవత్సరాల మోడీ పాలనను.. బీజేపీ కన్నా ఎక్కువుగా టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. అమిత్ షా, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని అమిత్ షా ప్రకటన చేస్తారని ఆశించాం. విశాఖ స్టీల్ ఫ్లాంట్ స్కామ్ చేసింది బీజేపీ. 32మంది ప్రాణ త్యాగంతో స్టీల్ ఫ్లాంట్ సాధించుకున్నాం. అమరావతి ఒక పెద్ద స్కామ్ అని బీజేపీ నేతలే చెప్పారు” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)