వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం

Telugu Lo Computer
0


ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా శనివారం తెల్లవారుజామున ఈ సమస్య మొదలైంది. లక్షలాది మంది యూజర్లు, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ లను యాక్సెస్ చేయలేకపోయారు. చాలా సేపు వాట్సాప్‌లో మెసేజ్‌లు సెండ్ అవలేదు. రిసీవ్ కాలేదు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మెసేజ్‌లు పంపడానికి ఇబ్బంది పడ్డారు. ఇన్ స్టాగ్రామ్లో స్టోరీలు లోడ్ అయినప్పటికీ..ఎర్రర్ మెసేజ్ లు వచ్చాయి. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాట్సాప్, ఫేస్ ముక్ మెసేంజర్లలో సందేశాలను పంపడంలో స్వీకరించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు. డౌన్‌డెటెక్టర్ వెబ్‌సైట్‌ ప్రకారంఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ సేవలకు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. సేవల అంతరాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ అంగీకారించింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ సేవలకు అంతరాయం కలగడంతో యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ అసంతృప్తిని ట్విట్టర్ లో వ్యక్తీకరించారు. ఈ యాప్స్ లో ఎదుర్కొన్న సమస్యలను హైలైట్ చేస్తూ మీమ్‌లు, GIFలను పోస్ట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)