స్పైడర్ మ్యాన్ మెచ్చిన ఆర్ఆర్ఆర్

Telugu Lo Computer
0


ముంబాయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి  స్పైడర్ మ్యాన్ హీరో టామ్ హాలండ్ ఇండియా వచ్చారు. మూడు రోజులపాటు ఇక్కడే ఉన్న ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ గురించి ప్రస్తావించారు. “నాకు భారత్ పర్యటన ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చింది. కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు. ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన అనుభవం. ఈ పర్యటనను జీవితంలో మర్చిపోలేను. మళ్లీ ఇండియాకు వెళ్లాలనుకుంటున్నాను. మూడు రోజుల్లో ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ పర్యటన అద్భుతంగా గడిచింది. అలాగే హిట్ అయిన ఆర్ఆర్ఆర్ ను చూశాను. ఆ మూవీ నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)