అవినాష్ బెయిల్ పై సునీత పిటిషన్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తెలంగాణ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వివేకా కుమార్తె సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ కు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఇవాళ ఆమె లాయర్ సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు. వైఎస్ వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రమేష్ బిందాల్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఆమె లాయర్ ప్రస్తావించారు. దీంతో ఈ పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో సునీత ఈ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారించే కేసుల జాబితాలో ప్రస్తావించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ అంగీకరించింది. దీంతో రేపు లిస్ట్ అయ్యే కేసుల జాబహితాలో ఈ కేసును కూడా చేర్చబోతున్నారు. ఈ మేరకు కేసు డైరీ నంబర్ ను సునీత లాయర్ ధర్మాసనానికి అందించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు రేపు రిజిస్ట్రీ ఈ కేసును విచారణ కేసుల జాబితాలోకి చేర్చనుంది. అవినాష్ కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు పలు కీలక అంశాల్ని విస్మరించిందని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీబీఐతో పాటు సునీత లాయర్ల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)