ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత : ఒకరు మృతి

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని జునాగఢ్‌లో అక్రమంగా నిర్మించిన దర్గా కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. దర్గా కూల్చివేత నోటీసులు జారీ చేయడానికి వెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులపై అందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు పోలీసులు గాయపడ్డారు. దర్గాను అక్రమంగా నిర్మించారని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించిన అధికారులు దర్గా కూల్చివేతకు సంబంధించిన నోటీసులను జారీ చేయడానికి వెళ్లగా ఆందోళనకారులు అధికారులను అడ్డగించారు. అనంతరం అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసు పోస్టును కూల్చివేశారు. దాదాపు 300 మంది నిరసనకారులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ఉపయోగించారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురు పోలీసులతో సహా ఓ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 174 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)