కుక్కలను కాయడానికి సంవత్సరానికి కోటి రూపాయలు జీతం !

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో జార్జ్ రాల్ఫ్-డన్, ఫెయిర్‌ఫాక్స్, కెన్సింగ్టన్‌లో ఒక బిలియనీర్‌ కు ఉన్న కుక్కల్ని చూసుకోవానికి ఉద్యోగి కావాలంటూ ప్రకటించారు. ఆయనకున్న రెండు కుక్కల సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలి అంటూ డాగ్ నానీ జాబ్స్ అంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంవత్సరానికి అతను కోటి రూపాయల శాలరీ ప్రకటించారు. ఉద్యోగికి సంవత్సరానికి ఆరు వారాలు సెలవులు. అంతేకాకుండా ఆ కుక్కలతో కలిసి ఎంచక్కా విమానం ప్రయాణాలు కూడా చేయొచ్చు. ఇవేకాకుండా మంచి వసతి, భోజన ఏర్పాట్లు కూడా ఆ ఉద్యోగికి కల్పించడం జరుగుతుంది. డాగ్ నానీ జాబ్ చేయాల్సిన పనులేమంటే  కుక్కలకు సరైన సమయానికి ఆహారం పెట్టాలి. టైముకి డాక్టర్ వద్దకు చెకప్ లకు తీసుకెళ్లాలి. వాటికి శుభ్రంగా స్నానం చేయించటం, ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం, వాటిని వాకింగ్ కు తీసుకెళ్లటంతోపాటు వాటిని ఎప్పుడు ఉత్సాహంగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు తప్పనిసరిగా కుక్కల గురించి అవి తినే ఆహారం, తాగే పానీయాల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)