కుక్క మాంసం అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు

Telugu Lo Computer
0


నాగాలాండ్ లో కుక్క మాంసం అమ్మకం, వినియోగం అక్కడి స్థానిక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని గువహాటి హైకోర్టులోని కోహిమా బెంచ్ బుధవారం రద్దు చేసింది. మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశం సరైంది కాదని కోర్టు పేర్కొంది. కుక్కల్ని దిగుమతి చేసుకోవడం కానీ, కుక్కల మీద వ్యాపారం చేయడం కానీ, కుక్క మాంసాన్ని వినియోగించడం, విక్రయించడం, రెస్టారెంట్లలో అందుబాటులో ఉంచడం వంటిని చేయకూడదని నాగాలాండ్ ప్రభుత్వం 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై నాగాలాండ్ ప్రభుత్వ తరపు న్యాయమూర్తి మార్లీ వాన్‌కుంగ్ గత శనివారమే కోర్టుకు వివరణ ఇచ్చారు. వాస్తవానికి చట్టం చేయకుండా కుక్క మాంసాన్ని నిషేధించలేదని, ప్రభుత్వం కేవలం ఆదేశాలు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశంలో  ''కుక్క మాంసం వ్యాపారం, వినియోగానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి చట్టం రాకపోయినప్పటికీ ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ ద్వారా కుక్క మాంసం అమ్మకం, వినియోగంపై నిషేధం విధించబడింది. దీనిని రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా 04.07.2020 తేదీతో కూడిన నోటిఫికేషన్ ఆమోదించబడింది'' అని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఎఫ్‌ఎస్‌ఎస్) చట్టం ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధ ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎక్కడా పేర్కొనలేదని కోర్టు వాదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)