470 విమానాల కొనుగోలుకు సంతాకాలు చేసిన టాటా !

Telugu Lo Computer
0


470 విమానాల కొనుగోలుకు సంబంధించి ఎయిర్‌బస్, బోయింగ్‌ కంపెనీలతో ఒప్పందాలను టాటా గతంలో కుదుర్చుకోగా  దీనిపై మంగళవారం వారు సంతకాలు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా 70 బిలియన్ డాలర్లు  భారత కరెన్సీలో రూ.5.74 లక్షల కోట్లతో విమానాలను కొనుగోలే చేసేందుకు ఒప్పందాలను పారిస్ ఎయిర్‌షోలో కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా క్లారిటీ ఇచ్చింది. అయితే, వీటిల్లో 34 విమానాలు A350-1000, A350-900, 6, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్స్ 20, 777 ఎక్స్ వైడ్ బాడీ విమానాలు 10 ఉన్నాయి. వీటితో పాటు మరో 140 ఎయిర్‌బస్ A320 నియో, ఎయిర్‌బస్ A321 నియో 70, 190 బోయింగ్ 737 మ్యాక్స్ నారోబాడీ విమానాలను ఆర్డర్‌ చేశారు. ఇంకా అవసరమైతే.. మరో 70 విమానాలు కూడా తీసుకునేలా మొత్తం 290 విమానాలకు ఒప్పందం చేసుకున్నట్లు బోయింగ్ తెలిపింది. ఇక దక్షిణాసియాలో బోయింగ్‌కు ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద డీల్ అని పేర్కొంది. ఈ విమానాల డెలివరీ 2025 కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖర్లోనే ఎయిర్‌బస్ A350 విమానాల రాక మొదలవుతుందని.. ఆర్డర్‌లో ఎక్కువ భాగం 2025 మధ్య వరకు వస్తాయని ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. ఇప్పటికే ఎయిరిండియా 11 B777, 25 A320 విమానాలను లీజుపై తీసుకుంటోందని ఎయిరిండియా సీఈఓ, MD క్యాంప్‌బెల్ విల్సన్ చెప్పారు. ఇప్పటివరకు భారత విమానయాన చరిత్రలోనే ఈ 470 విమానాల కొనుగోలు ఒప్పందం అతిపెద్దదిగా నిలిచింది. కాగా.. గత శుక్రవారం దేశీయ అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో దానిని తిరగరాసింది. ఒకేసారి ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇక, ఇవి వచ్చేందుకు మాత్రం మరో పదేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాట్లు తెలుస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)