370వ అధికరణ రద్దు చేసినప్పుడు కేజ్రీవాల్ ఎక్కడున్నారు?

Telugu Lo Computer
0


కాశ్మీర్ లోని రాజౌరిలో ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ ''370వ అధికరణ రద్దు చేసినప్పుడు కేజ్రీవాల్ ఎక్కడున్నారు? అప్పుడు ఆయన కేంద్రానికి మద్దతిచ్చారు. ఈరోజు ఆయన ఇతర పార్టీలను మద్దతు ఇమ్మని అడుగుతున్నారు'' అని అన్నారు. ఢిల్లీలో గ్రూప్-ఎ అధికారుల నియామకాలు, బదిలీలపై అధికారం తమకు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం మే 19న ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీల  అధికారాన్ని కట్టబెడుతూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన వారం రోజుల్లోనే కేంద్రం ఈ ఆర్డినెన్స్ తెచ్చింది. కేంద్రం చర్యను తప్పుబట్టిన కేజ్రీవాల్ ఇందుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మద్దతును కూడగడుతున్నారు. కేంద్ర తెచ్చిన ఆర్డినెన్స్ స్థానే బిల్లు రాకుండా పార్లమెంటులో అడ్డుకోవాలని కోరుతూ ఇంతవరకూ ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, ఎంకే స్టాలిన్, సీతారాం ఏచూరి, కె.చంద్రశేఖరరావు, మమతా బెనర్జీ, నితీష్ కుమార్‌లను కేజ్రీవాల్ కలుసుకున్నారు. వీరిలో చాలామంది బహిరంగంగానే కేజ్రీవాల్‌రు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు తొలిసారిగా ఒమర్ అబ్దుల్లా నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)