రూ.2 వేల నోట్ల ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు !

Telugu Lo Computer
0


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ అంశంపై కీలక ప్రకటన చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ మీద రూ. 2 వేల కరెన్సీ నోట్ల ఉపసంహరణ వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఒక్క విషయాన్ని అయితే కచ్చితంగా చెప్పగలను. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు' అని ఆయన అన్నారు. కాగా ఆర్‌బీఐ గత నెలలో రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిని మార్చుకోవడానికి సెప్టెంబర్ నెల చివరి వరకు అవకాశం ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)